telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనాకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు: తలసాని

talasani srinivas yadav

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాలంలో కూడా కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనాకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్‌లోలాక్ డౌన్ పెట్టాలా? వద్దా? అన్న విషయం పరిశీలిస్తున్నామన్నారు. లాక్ డౌన్ పెట్టాలంటే అనేక అంశాలతో ముడిపడి ఉందన్నారు.

లాక్ డౌన్‌వల్ల అన్నింటికి పరిష్కారం అవుతుందనుకుంటే సరికాదన్నారు. వైరస్ అనేది నూటికి 70 శాతం మందికి వస్తుంది.. పోతుందన్నారు. అయితే 60 ఏళ్లు దాటినవాళ్లు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమన్నారు. ఇక ప్రభుత్వం చేయాల్సిన పని చేస్తుందని, ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వారు తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు.

Related posts