telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

యాప్స్ ఆగడాలు : ఏడుగురు ఆత్మహత్య

లాక్ డౌన్ లోనూ లోన్ యాప్స్ ఆగడాలు ఆగడం లేదు. కరోనా సమయంలో కూడా వ్యాపారం చేస్తున్నారు లోన్ యాప్స్ నిర్వాహకులు. రెండు సంవత్సరాల్లో 16 వేల రూపాయల లావాదేవీలు నిర్వహించారు నిర్వాహకులు. దీంతో ఆన్లైన్ లోన్ యాప్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు హైదరాబాద్ పోలీసులు. లాక్ డౌన్ లో యువతను టార్గెట్ చేసి రుణాలు ఇచ్చిన యాప్ నిర్వాహకులు..ఆన్లైన్ లోన్ యాప్ లను షాంఘైలో రూపొందించినట్టు పోలీసులు తేల్చారు. ప్రధాన నిందితులు ల్యాంబో సహా 28 మంది అరెస్ట్ అయ్యారు. సుత్రదారి జెన్నిఫర్ కోసం ఇంకా గాలిస్తున్నారు పోలీసులు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగుళూర్ ముంబై, ఢిల్లీలోనూ అధిక బాధితులు ఉన్నారు. నిర్వాహకులు వేదింపులు తాళలేక తెలంగాణలో ఇప్పటికే ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు. చైనాలో ఓ ప్రైవేట్ కంపెనీలో కన్సల్టెంట్ లుగా పనిచేస్తున్నారు జెన్నిఫర్, వాంగ్ జియాంగ్. ఇద్దరు కలిసి 2019 నవంబర్ లో ఢిల్లీలో మూడు సంస్థలు ప్రారంభించారు. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్ లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. బెంగుళూరు బాధ్యతలు చూసుకున్న జీయాంగ్.. గత ఏడాది లాక్ డౌన్ కు ముందు చైనా వెళ్లిపోయారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై బాధ్యతలు ల్యాంబోకి అప్పగించి జకార్తా వెళ్ళాడు జెన్నిఫర్. ఆన్లైన్ లోన్ యాప్ లతో 7 నెలల్లో 30 వేల కోట్లు లావాదేవీలు జరగగా..11 వేల కోట్ల లాభం పొందారు చైనా నిర్వాహకులు. వచ్చిన లాభంతో వర్జిన్ ఐలాండ్ లో ఉన్న బినామీ ఖాతాలోకి నగదు బదిలీ చేశారు. దశల వారీగా వందల కోట్ల రూపాయలు షంఘైకు తరలించారు. ఒక్క రోజులో రూ. 250 కోట్లు రుణంగా నిర్వాహకులు ఇచ్చారు. అయితే.. నిర్వాహకులు ఖాతాలో నుండి రూ. 315 కోట్లు ఫ్రీజ్ చేశారు పోలీసులు.

Related posts