భారత కార్పొరేట్ దిగ్గజం రియలన్స్ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం లండన్‌కు మకాం మార్చబోతున్నారనే వార్త ఓ ఆంగ్ల వార్తాపత్రికలో ప్రచారమైంది. ఇండియా మరియు UK మధ్య వ్యాపారాన్ని విస్తరించాలని అంబానీ కుటుంబం ఆలోచిస్తున్నట్లు, అందుకే లండన్‌లోని 300 ఎకరాల స్టోక్ పార్క్ ఎస్టేట్‌కు అంబానీలు మారబోతున్నారని పేర్కొంది.
అయితే పుకార్లకు చెక్ పెడుతూ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అంబానీ కుటుంబానికి లండన్‌కే కాదు ప్రపంచంలో మరే చోటుకు వెళ్లడానికి ఎటువంటి ఆలోచన లేదని RIL స్పష్టం చేసింది.
ఈ ఏడాది ప్రారంభంలో హెరిటేజ్ ప్రాపర్టీని “ప్రీమియర్ గోల్ఫింగ్ మరియు స్పోర్టింగ్ రిసార్ట్”గా మార్చే ఉద్దేశ్యంతో రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఇటీవలే లండన్‌లోని స్టోక్ పార్క్ ఎస్టేట్‌ను రూ.592 కోట్లకు కొనుగోలు చేశామని స్పష్టతనిచ్చింది. ఈ ఎస్టేట్‌లో 49 బెడ్‌రూమ్‌లు, బ్రిటీష్ వైద్యుడి నేతృత్వంలో అత్యాధునిక వైద్య సౌకర్యం మరియు ఇతర విలాసవంతమైన ఫీచర్లు ఉన్నాయి.
అంబానీ కుటుంబ సభ్యుల విదేశీ పర్యటన స్టోక్ పార్క్‌ను వారి రెండవ ఇల్లుగా మార్చుకోబుతున్నట్లు తెలిపారు. వారు ప్రస్తుతం ముంబైలోని యాంటిలియాలోని 400,000 చదరపు అడుగుల అల్టామౌంట్ రోడ్డు నివాసంలో నివసిస్తున్నారు.
లండన్‌లో ఈ ఎస్టేట్ కొనుగోలుతో భారత్‌కు మాత్రమే ప్రసిద్ధమైన ఆథిత్య రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేయాలనే లక్ష్యంతోనే ఎస్టేట్‌ను కొనుగోలు చేసినట్లు రిలయన్స్ గ్రూప్ స్పష్టం చేసింది.