telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

బస్సుల్లో రెండు సీట్ల చార్జీలు వసూలు

rtc bus jarkhand

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్‌లాక్ 4 మార్గదర్శకాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జార్ఖండ్ రాష్ట్రం‌లో ఎట్టకేలకు బస్సులు తిరుగుతున్నాయి. అయితే ప్రైవేట్ ట్రావల్స్ మాత్రం ప్రయాణీకులపై అధనపు భారం మోపుతోంది. ఒక ప్రయాణికుడి నుంచి రెండు సీట్ల మేరకు చార్జీలు వసూలు చేస్తున్నారు.

అధనపు చార్జీల అసూలుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావల్స్ ఏజెంట్లు మాత్రం దీనిని సమర్ధించుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బస్సుల్లో ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉండేందుకు రెండు సీట్లను ఒకరికే కేటాయిస్తున్నట్లు చెప్పారు. దీని వల్ల తమకు నష్టం వాటిల్లుతున్నందున ప్రయాణికుల నుంచి రెండు సీట్ల చార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రైవేట్ ట్రావల్స్ యజమాన్యం తెలిపింది.

Related posts