telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

వీర్వోను కాలర్ పట్టుకుని ఆఫీసు నుంచి బయటకు లాక్కొచ్చిన మహిళ

ప్రతిపనికి లంచాలు పుచ్చుకోవడం రెవెన్యూ శాఖలో మామూలే. భూ సమస్యను పరిష్కరించాలంటూ వీఆర్వో చుట్టూ తిరిగి తిరిగి ఆ మహిళా రైతుకు ఓపిక నశించింది. ఓ పనికోసం మాములిచ్చిన పని చేయని వీర్వోను కాలర్ పట్టుకుని ఓ మహిళ ఆఫీసు నుంచి బయటకు లాకొచ్చింది. నువ్వు అడిగినన్ని పైసలు ఇచ్చి.. ఏడాదిగా తిరుగుతున్నా.. నా సమస్యను పట్టించుకోవా అంటూ వీర్వోను కాలర్ పట్టుకుని కార్యాలయం నుంచి బయటకు లాక్కొచ్చి మరీ పోచమ్మ అనే మహిళ నిలదీసింది.

ఈ ఘటన సంగారెడ్డి జిల్లా, వటపల్లి మండలంలో జరిగింది. రెవెన్యూ అధికారుల నిర్వాకం చేతి వాటంతో రికార్డులను మార్చేసి బతికున్న పోచమ్మ అనే వృద్ధిరాలిని చనిపోయినట్లు సృష్టించారు. బాధితురాలు సమస్య పరిష్కారం కోసం డబ్బులిచ్చిన వీర్వో పనిపూర్తి చేయకపోవడంతో ఆగ్రహంతో వీర్వోను కాలర్ పట్టుకుని నిలదీసింది. ఆమె ప్రవర్తనతో విసుగెత్తిన వీర్వో రామలింగం ఆగ్రహంతో పోచమ్మను తోసేయడంతో కిందపడి గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్నఉన్నతాధికారులు స్పందించి కిండపడిఉన్న పోచమ్మను ఆస్పత్రికి తరలించారు.

Related posts