telugu navyamedia
రాజకీయ వార్తలు

మరోసారి చైనాపై విరుచుకుపడ్డ ట్రంప్

trump usa

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు. వైట్ హౌస్ లో జరిగిన స్పిరిట్ ఆఫ్ అమెరికా షోకేస్ అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ చైనాలోని ఓ ల్యాబ్ లో ఉద్భవించిందని, వైరస్ ఉనికిని చైనా ఉద్దేశపూర్వకంగా దాచిందని అనేక రకాల ఆరోపణలు చేసిన ట్రంప్ తాజాగా కరోనా వైరస్ ను ‘చైనా నుంచి వచ్చిన ప్లేగు వ్యాధి’గా పేర్కొంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గతంలో వచ్చిన ప్లేగు వ్యాధి ధాటికి ప్రజలు విలవిల్లాడారని, ఇలాంటిది అసలు మళ్లీ జరగకూడదని భావిస్తే చైనా దాన్ని పునరావృతం చేసిందని ఆరోపించారు. “ఓ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశామో లేదో వైరస్ వ్యాప్తి మొదలైంది. ఆ సంతకం సిరా ఆరకముందే మహమ్మారి బయటపడింది, ఇలా జరగడానికి చైనానే కారణం” అంటూ ట్రంప్ ఘాటుగా విమర్శించారు. 

Related posts