ఈరోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి… ఆదివారం రోజే తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ముగియగా.. మరో రెండు రోజుల్లో ఫలితాలు రానున్నాయి.. అయితే, ఈ ఎన్నికల్లో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు మరోసారి బరిలోకి దిగారు.. అసెంబ్లీ లాబీలో రామచంద్రరావును రౌండప్ చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ లో మేమే గెలుస్తామంటూ.. నీకు ఇదే చివరి అసెంబ్లీ సమావేశాలంటూ వ్యాఖ్యానించారు.. మా కండువా కప్పాలా అంటూ రామచంద్రరావు దగ్గరకు వచ్చారు ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ… దీంతో… ఎల్లుండి ఫలితం చూద్దాం అన్నారు ఎమ్మెల్సీ రామచంద్రరావు.. ఇలా, అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్సీ మధ్య సరదా సంభాషణ సాగింది.. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం అనూహ్యంగా పెరిగింది.. పెరిగిన ఓటింగ్ తమకు అంటే.. తమకే అనుకూలం అంటూ అంతా లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తంగా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
previous post