శ్రీశైలం పవర్ ప్లాంట్ లో సంభవించిన అగ్నిప్రమాదంలో భారీగా ప్రాణనష్టం జరిగింది. ప్లాంట్ లోపల చిక్కుకున్న 9 మందిలో .చివరకు ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు. రెస్క్యూ టీమ్ కు తొలుత అసిస్టెంట్ ఇంజినీర్ సుందర్ నాయక్ మృతదేహం లభ్యమైంది. ఆ తర్వాత మరో ఐదుగురి మృతదేహాలు కనిపించాయి. వీరిలో ఒక మహిళ కూడా ఉండటం మరింత ఆవేదనకు గురి చేస్తోంది.
వీరిలో ముగ్గురుని ఫాతిమా, సుందర్, మోహన్ కుమార్ గా గుర్తించారు. మరో రెండు మృతదేహాలు ఎవరివో గుర్తించాల్సి ఉంది. మరో ముగ్గురి ఆచూకీ ఇంకా తెలియలేదు. ప్రమాదంలో ప్రాణనష్టం జరగడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఎంపీ ధర్మపురి అరవింద్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జనసేన