telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఉచిత విద్యుత్ కు నగదు బదిలీ..ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం!

cm jagan ycp

ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఈ రోజు నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకొంది. ఈ కేబినెట్ సమావేశంలో ఈ నగదు బదిలీ అంశంపై చర్చ జరిగింది. కేంద్రం విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చిన నేపథ్యంల ఉచిత విద్యుత్ పథకానికి కూడా ఏపీ లో నగదు బదిలీ వర్తింపచేయనున్నారు.

కేబినెట్ సమావేశంలో ‘ఉచిత్ విద్యుత్ పథకం-నగదు బదిలీ’ విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ విద్యుత్ సంస్కరణల వల్ల రైతులపై ఒక్క పైసా కూడా భారం పడదని ఆన్నరు. రైతులకు అందించే విద్యుత్ ఎప్పటికీ పూర్తి ఉచితమేనని స్పష్టం చేశారు.అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షనను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు.

విద్యుత్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వారి పేరుతో కొత్తగా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసి, ఆ ఖాతాలోకి నేరుగా నగదు జమ చేస్తామన తెలిపారు. ఆ డబ్బునే డిస్కంలకు చెల్లించడం జరుగుతుందని వివరించారు. మొదట శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని అన్నారు. అనంతరం ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ నూతన విధానం అమలవుతుందని సీఎం పేర్కొన్నారు.

Related posts