మన దేశంలో ఈరోజు నుంచి 18 ఏళ్లు పై బడినవారికి వ్యాక్సినేషన్ ప్రారంభం కావాల్సి ఉన్నా.. వ్యాక్సిన్ల కొరతతో చాలా దేశాలు వెనక్కి తగ్గాయి.. అయితే, ఇదే సమయంలో.. వ్యాక్సిన్ల లోడ్‌తో ఉన్న ట్రక్కునే వదిలి పారిపోవడం సంచలనం మారింది.. మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లాలోని కరేలీ బస్టాండ్ దగ్గర దాదాపు 2.4 లక్షల కొవాగ్జిన్ డోసులు ఉన్న ట్రక్‌ను.. వదిలి పరారయ్యారు.. ఆ ట్రక్ ఎంతసేపటికి కదలకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కరేలీ పోలీసులు వచ్చి పరిశీలించారు.. ట్రక్సు ఉంది.. ట్రక్రుల్లో వ్యాక్సిన్లు ఉన్నారు.. కానీ, డ్రైవర్ లేదు.. ఇంకా ఎవరూ లేరు.. దీనిపై ఆరా తీసేపనిలో పడిపోయారు పోలీసులు.. ఇక, ట్రక్కులో ఉన్న వ్యాక్సిన్ల విలువ రూ. 8 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.. అసలు ఏం జరిగింది.. ఇద్ద పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు వదిలి పారిపోవాల్సి ఎందుకు వచ్చింది అనేది అంతుచిక్కడంలేదు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
next post