ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. భీజాపూర్ జిల్లా కేశ్‌కుతుల్ ప్రాంతంలో శుక్రవారం భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించారు. ఘటనాస్థలిలో మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాలను, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. కాగా, జూన్ మొదటివారంలో దామ్‌తారి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళా మావోయిస్టు మరణించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగానే మవోయిస్టులు ఈ దాడికి తెగబడ్డారని తెలుస్తోంది.