telugu navyamedia
Uncategorized ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రైతుల ఖాతాల్లోకి నేరుగా కరెంటు బిల్లు నగదు: బాలినేని

Balineni srinivas reddy ycp

కేంద్రం విద్యుత్ సంస్కరణలకు అనుగుణంగా రైతుల్లో అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంసిద్దమైంది. తాజాగా ఈ అంశంపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. రైతులపై రూపాయి కూడా భారం పడకుండా కరెంటు బిల్లులకు సంబంధించిన మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి ముందుగానే జమ చేయాలని సీఎం జగన్ ఆదేశించారని వెల్లడించారు.

అన్నదాతలు తమ ఖాతాల్లోకి నగదు జమ అయిన తర్వాతే బిల్లు మొత్తాన్ని డిస్కంలకు చెల్లిస్తారని మంత్రి తెలిపారు. రైతులు నేరుగా బిల్లులు చెల్లించడం ద్వారా నాణ్యమైన కరెంట్ సరఫరా కోసం డిస్కమ్ అధికారులను ప్రశ్నించవచ్చని తెలిపారు. దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ ను మరో 30 ఏళ్ల పాటు కొనసాగించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని బాలినేని అన్నారు.

Related posts