పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ నేతల పై వరుస దాడులు జరుగుతున్నాయి. హమైపూర్ గ్రామ పెద్ద అయిన సోఫియుల్ హసన్ దారుణ హత్యకు గురయ్యారు. సఫియుల్ హరిహర్‌పర వెళ్తుండగా ముర్షీదాబాద్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కాల్చి చంపారు. ఆయన హత్య వెనక గల కారణాలు తెలియరాలేదు.
ఈ హత్య వెనక బీజేపీ నేతల హస్తం ఉందని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. టీఎంసీ నేతలపై ఇటీవల దాడులు విపరీతంగా పెరిగాయి. హుగ్లీ జిల్లాలో స్థానిక నేతను హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేశారు. ముర్షీదాబాద్‌లో టీఎంసీ కార్యకర్తల ఇళ్లపై జరిగిన బాంబు దాడిలో ముగ్గురు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. తాజా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇంత జరుగుతున్నా జగన్ లో చలనం లేదు: చంద్రబాబు