telugu navyamedia
ఆంధ్ర వార్తలు

జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు నాలుగేళ్లు..

కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. జ‌గ‌న్‌కు సీఎం అవ్వాల‌నే గ‌ట్టి సంక‌ల్పంతో తండ్రి వైఎస్ఆర్‌ అడుగుజాడ‌ల్లో అడుగులు వేశారు. .గతంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్రతోనే ప్రజానేతగా ఎదిగారు.. కాంగ్రెస్‌లో తనకు ఎదురులేని స్థాయికి ఎదిగారు.

జనం సమస్యలు నేరుగా వినేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు .. నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది..ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ వ్యాప్తంగా సాగించిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది.

Bees attack Andhra opposition leader Jaganmohan Reddy's padayatra | Latest  News India - Hindustan Times

రాష్ట్రంలో 13 జిల్లాలను దాటుకుంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది.పాదయాత్ర సమయంలో జనం చెప్పిన సమస్యలు వింటూ, వారి కన్నీళ్లు తుడుస్తూ ముందకు సాగారు. ఎండల తీవ్రతను, భారీ వర్షాలను, వణికించే చలిని ఇలా అన్ని కాలాల్లోనూ పాదయాత్ర సాగింది.  ప్రతికూల వాతావరణంలోనూ సడలనీయక పాదయాత్ర సాగింది. జనం మధ్యే అడుగు మొదలుపెట్టి.. జనం మధ్యే జగన్‌ విడిదిచేశారు. 

 

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌

ఇడుపుల పాయలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి 2017 నవంబర్‌ 6న జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. రాష్ట్రంలో13 జిల్లాలను దాటుకుంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9న ముగిసింది. 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2 వేల 5 వందల 16 గ్రామాల మీదుగా జగన్‌ పాదయాత్ర సాగింది.

యాత్రకు నాలుగేళ్లు: జగన్‌ను జననేతను చేసిన యాత్ర..

అలాగే 341 రోజుల పాటు 3 వేల 6 వందల 48 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. క్షేత్రస్థాయిలో రాష్ట్రం నలుమూలలా జగన్‌ పాదయాత్ర చేశారు. నేను ఉన్నానంటూ.. వారికి ఎనలేని భరోసా నిచ్చారు జ‌గ‌న్‌… చదువు, ఆరోగ్యం కోసం కుటుంబాలు ఆస్తులు అమ్ముకునే పరిస్థితులను తాను చూశానని, కచ్చితంగా ప్రజలకు అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు. వివక్షలేని పాలనను అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ముంగిటకే సేవలను తీసుకొస్తానని చెప్పారు.

ఎన్నో అటుపోట్లు ఎదుర్కొని ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 151 అసెంబ్లీ సీట్లతో తిరుగులేని విజయం దక్కించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారు.

 

ప్రజా సంకల్ప యాత్ర ద్వారా అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, మహిళా సాధికత, విద్యా దీవెన, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఇవన్నీ.. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేస్తున్నామని చెబుతోంది ప్రభుత్వం..

Related posts