telugu navyamedia
ఆంధ్ర వార్తలు

తీవ్రవాయుగుండంగా మారిన ‘గులాబ్’ తుఫాన్‌..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప‌పీడ‌నం తీవ్రవాయుగుండంగా మారింది. నిన్న ఏర్పడిన అల్పపీడనం… సాయంత్రంకు తీవ్ర వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 670 కి.మీ. దూరంలో తూర్పు – ఆగ్నేయ దిశలో, కళింగపట్నానికి 740 కి.మీ. దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ తుపాను పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో విశాఖపట్నం , గోపాల్​పూర్ మధ్యలోని కళింగపట్నం వద్ద రేపు సాయంత్రం తీరం దాటే అవకాశం ఉన్న‌ట్లు తెలిపారు.

Cyclone alert issued for Andhra, Odisha as low pressure area over Bay of Bengal intensifies into depression - India News

ఈ తుఫాన్‌ను ‘గులాబ్’ అని పేరు పెట్టారు. ఆదివారం సాయంత్రం నాటికి ఈ గులాబ్ తుఫాన్ తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు తూర్పు గోదావరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈనెల 27 తేదీన ఈశాన్య- తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని, దీని ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు ప్రకటించింది. మ‌త్య‌కారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా ప్రయాణించి ఈనెల 29న పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకుంటుందని వెల్లడించింది.

Cyclone Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న మరో రెండు తుఫాన్లు.. ఎన్నో రోజులు గ్యాప్ లేదు

తుఫాన్‌ ప్రభావం వల్ల శని, ఆదివారాల్లో తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్లు, గరిష్టంగా 80 కి.మీ, సోమవారం 70 నుంచి 80 కి.మీ, గరిష్టంగా 90 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని,  స్థానికుల‌కు  సముద్ర తీరంలోకి వెళ్లవద్దు, ఎందుకంటే సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది  హైల‌ర్ట్ అధికారులు  ప్ర‌క‌టించారు.

Related posts