తెలంగాణలో ఖాళీగా ఉన్న మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ల పోస్టులతోపాటు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేసేందుకు రవాణాశాఖ రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలో కొత్తగా జిల్లాలు ఏర్పడడంతో చాలా మంది ఎంవీఐలను జిల్లా రవాణాశాఖ అధికారులుగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఎంవీఐల కొరత తీవ్రంగా రవాణాశాఖను వేధిస్తున్నది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఖాళీగా 61 ఎంవీఐ పోస్టులున్నాయి. 14 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల సీట్లలో ఇప్పటికే సీనియర్ అసిస్టెంట్లు ఇన్‌చార్జీలుగా కొనసాగుతున్నారు. దీనివల్ల అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏఎంవీఐలకు ఎంవీఐలుగా, సీనియర్ అసిస్టెంట్లకు అడ్మిన్ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించేందుకు సీనియారిటీ జాబితా రూపొందించారు.