telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

లిక్కర్ షాపులు, పబ్స్, క్లబ్స్ పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2055 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఏడుగురు కరోనాతో మృతి చెందారు. ఇదే సమయంలో 303 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 3,18,704 కు చేరగా.. రికవరీ కేసులు 3,03,601 కు పెరిగాయి..  అయితే కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా టెస్టుల సంఖ్య, వ్యాక్సిన్, వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి తీసుకుంటున్న చర్యలపై హైకోర్టుకు రిపోర్ట్ సమర్పించింది తెలంగాణ ప్రభుత్వం.

పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డీజీపీలు కూడా తమ రిపోర్టులను హైకోర్టుకు అందజేశారు. అయితే.. దీనిపై హైకోర్టు స్పందిస్తూ… ఆర్టీపీసీఆర్ టెస్టులు భారీగా పెంచాలని.. సేరో సర్వేలెన్స్ సర్వే ప్రారంభించామని ప్రభుత్వం చెప్పింది.. ఆ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. లిక్కర్ షాపులు, పబ్స్, క్లబ్స్, సినిమా హాల్స్, ఫంక్షన్ హాల్స్ పై ఆంక్షలు విధించాలని హైకోర్టు తెలిపింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఉంటేనే రాష్ట్రంలోకి వచ్చేలా అడ్వైజరీ జారీ చేయాలని.. డిజాస్టర్ యాక్టు ప్రకారం నిపుణులతో అడ్వైజరీ కమిటీ వేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం చెప్పిన విధంగా 100 మంది ఉన్న కార్యాలయాల్లో వ్యాక్సినేషన్ చేయాలని…. మాస్కులు, సామాజిక దూరంపై నమోదైన కేసులు చాలా తక్కువ అని పేర్కొంది. కరోనా ప్రబలకుండా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Related posts