telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఫేక్‌ న్యూస్‌పై సీఎం జగన్‌ సంచలన నిర్ణయం !

cm Jagan tirumala

ఈ మధ్యకాలంలో ఫేక్‌ న్యూస్‌, ఫేక్‌ ప్రచారాలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులపై ఈ అసత్య ప్రచారాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ ఎమ్మెల్యే.. అధికార పార్టీలో చేరుతున్నారు.. ఆ పార్టీ నేత పార్టీకి రాజీనామా పెడుతున్నాడంటూ అనే వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రజలు ఏ న్యూస్‌ నమ్మాలో అర్థం కావడంలేదు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ కట్టడిపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఏపీ ఫ్యాక్ట్ చెక్ పేరుతో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసింది జగన్‌ ప్రభుత్వం. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ ఫ్యాక్ట్‌చెక్‌ వెబ్‌సైట్, ట్విట్టర్‌ అకౌంట్‌ను ప్రారంభించారు సీఎం జగన్‌. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. మీడియా, సోషల్‌ మీడియాలో దురుద్దేశ పూర్వక ప్రచారం చేస్తున్నారని.. ఈ తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ వేదికగా ప్రభుత్వం ఖండిస్తుందన్నారు సీఎం జగన్‌. నిజమేంటో, అబద్ధం ఏంటో చూపిస్తారని..దురుద్దేశపూర్వక ప్రచారంపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యక్తులు, వ్యవస్థల ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే హక్కు ఏ ఒక్కరికీ లేదని… ప్రజలను తప్పు దోవపట్టించే పనులు ఎవరూ చేయకూడదన్నారు. ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా చేపడుతున్న కార్యక్రమాలపైన వ్యవస్థలను, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారాలు చేస్తున్నారని… ఇలాంటి వాటికి ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలని తెలిపారు.

Related posts