telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

జూన్‌ 21వరకు సౌదీలో కర్ఫ్యూ పొడగింపు

saudi released 95 lakhs to hajj yatra disciple

జూన్‌ 21వరకు సౌదీ అరేబియా ప్రభుత్వం కర్ఫ్యూను పొడగించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి రెడు నెలల క్రితం దేశవ్యాప్తంగా సౌదీ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. జూన్ 21 వరకు క్రమంగా కర్ఫ్యూను సడలించనుంది. దేశంలో కరోనా కేసులు తగ్గడంతో క్రమంగా నిబంధనలను సడలిస్తూ వస్తున్నది. గురువారం నుంచి కర్ఫ్యూ సమయాన్ని మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు తగ్గించింది.

దేశంలో సోమవారం నుంచి వాహనాలను రోడ్లపైకి అనుమతించింది. క్రమంగా జూన్‌ 21 నాటికి కర్ఫ్యూ మొత్తాన్ని ఎత్తివేయనున్నట్లు ప్రకటించింది. ముస్లింలకు పవిత్ర స్థలమైన మక్కాలో మాత్రం ఇప్పట్లో కర్ఫ్యూ ఎత్తివేసే అవకాశం లేదని వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 74,795 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 399 మంది మరణించారు.

Related posts