telugu navyamedia
రాజకీయ వార్తలు

భారత్ వైరస్ చాలా ప్రమాదకరం: నేపాల్ ప్రధాని

Nepal Pm Oli

భారత్ పై నేపాల్ ప్రధాని కేపీ ఓలీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో ఆయన మాట్లాడుతూ.. చైనా, ఇటలీలోని కరోనా వైరస్ కన్నా భారత్‌లోని వైరస్ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోందని ఓలీ ఆరోపించారు. వైరస్ తమ దేశంలో వ్యాపించడానికి భారతే కారణమన్నారు. భారత్‌లోని లిపులేఖ్, కాలపానీ, లింపియాధురా ప్రాంతాలు నేపాల్‌వేనని పేర్కొన్నారు.

రాజకీయ, దౌత్యపరమైన మార్గాల ద్వారా వాటిని స్వాధీనం చేసుకుంటామన్నారు. భారత్-నేపాల్ మధ్య సరిహద్దు వివాదం నెలకొన్న ప్రస్తుత తరుణంలో నేపాల్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నేపాల్ వ్యాఖ్యలు దురుద్దేశపూర్వకంగా ఉన్నాయని, నేపాల్‌తో చైనానే ఈ మాటలు అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts