telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఆచార్య పై కాజల్ స్పందన…

Kajal

దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తో పాటుగా మెగాపవర్ స్టార్ రాంచరణ్ కూడా కీలక పాత్రలో చేస్తున్నాడు. దాదాపు రాంచరణ్ 40నిమిషాల నిడివి ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో మెగాస్టార్ చిరంజీవికి కాజల్ అగర్వాల్ కథానాయికగా చేస్తోంది. అయితే కాజల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే విషయం తెలిసిందే. అంతేకాకుండా సోషల్ మీడియాలో అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తుంటుంది. ఇటీవల కాజల్‌ను ఆచార్య సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చింది. ‘ఈ సినిమాలో చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి అద్భుతమైన పాత్రలో చేసి చాలా కాలం గడిచిపోయింది. నేను ఇటువంటి పాత్రలను చాలా మిస్ అవుతున్నాను. లాక్‌డౌన్ కారణంగా ఇటువంటి పాత్రలపై నాకున్న ఇష్టం మరింతగా పెరిగింద’ని కాజలు బదులిచ్చింది. ఇదిలా ఉంటే ఆచార్య సినిమాలో కాజల్ పాత్రకు ముందుగా త్రిష కృష్ణణ్‌ను సంప్రదించారు. కానీ ఆమె ఈ అవకాశాన్ని తిరస్కరించడంతో ఆ పాత్ర కాజల్ చెంతకు చేరింది.

Related posts