telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

గట్టిగ ప్రయత్నిస్తున్న బంగ్లాదేశ్ .. కోహ్లీసేన ఫలించేనా..

bangladesh players struggle on d & n test

బంగ్లా-భారత్ మధ్య జరుగుతున్న డే అండ్ నైట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో రోజున టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. ఆ తర్వాత భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 347 పరుగులు చేయగా, అదే స్కోరు వద్ద డిక్లేర్డ్ చేశాడు. దీంతో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగుల ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. తన బౌలర్ల ప్రదర్శన పట్ల విశ్వాసం ఉంచిన కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసేందుకు వెనుకాడలేదు. షమీ, ఉమేశ్, ఇషాంత్‌లతో కూడిన టీమిండియా పేస్ దళాన్ని ఎదుర్కొని 200 పైచిలుకు పరుగులు చేయడం బంగ్లాకు తలకు మించిన పనే! ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.

రెండో రోజు ఆట తొలి సెషన్‌లో కోహ్లీ (136) సెంచరీ హైలైట్ అని చెప్పాలి. పింక్ బంతిని ఎదుర్కోవడం తొలిసారే అయినా ఎంతో పట్టుదల కనబర్చిన కోహ్లీ అద్భుతరీతిలో శతకం సాధించాడు. అంతకుముందే రహానే (51), జడేజా (12) కూడా వెనుదిరిగారు. బంగ్లా బౌలర్లలో అల్ అమీన్ 3, ఇబాదత్ 3, అబు జాయేద్ 2 వికెట్లు సాధించారు. రెండో రోజు ఆట తొలి సెషన్‌లో కోహ్లీ దూకుడుగా ఆడి రికార్డు సెంచరీ నమోదు చేయగా.. రహానే ఓపికగా ఆడి, అర్థ సెంచరీ సాధించాడు. తొలి సెషన్‌ను భారత్ 4 కోల్పోయి, 289 పరుగులతో ముగించింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా ఆటగాడు ముష్ఫికర్‌ రహీమ్‌ (59; 70 బంతుల్లో 10×4) ఆచితూచి ఆడుతున్నాడు. అందివచ్చిన బంతుల్ని బౌండరీకి తరలిస్తూ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతడికి తైజుల్‌ ఇస్లామ్‌ (11; 21 బంతుల్లో 1×4) సహకారం అందిస్తున్నాడు. 32 ఓవర్లకు బంగ్లా 152/5తో ఉంది. ఆ జట్టు ఇంకా 89 పరుగుల లోటుతో ఉంది. ఆట ముగిసేందుకు మరికొన్ని ఓవర్లు మాత్రమే ఉండటంతో వికెట్లు తీసేందుకు టీమిండియా బౌలర్లు ప్రయత్నిస్తున్నారు.

Related posts