telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

నియంత్రణ చర్యలపై దాగుడుమూతలెందుకు : హైకోర్టు

ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా కారణంగా నైట్ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. కానీ ప్రభుత్వం విధించిన రేపటితో నైట్ కర్ఫ్య ముగియనున్న నేపథ్యంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. రేపు రాత్రితో నైట్ కర్ఫ్యూ ముగియ నున్నందున తర్వాత చర్యలు ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది.  రేపు పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తరపున న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.  చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఎందుకని, నియంత్రణ చర్యలపై దాగుడుమూతలెందుకు అని హైకోర్టు ప్రశ్నించింది.  కనీసం ఒకరోజు ముందు చెబితే నష్టం ఏంటని, నియంత్రణ చర్యలపై ఎలాంటి సూచనలు ఇవ్వడం లేదని, క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. అయితే చూడాలి మరి ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది.

Related posts