telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అనుష్కకు ఆ ఇద్దరి ముద్దు… పిక్ వైరల్

Anushka

దక్షిణాదిలో తెలుగు, తమిళ్‌, మళయాళం, కన్నడ సినిమా రంగాల్లో అందరు స్టార్ హీరోలతో నటించి హిట్లు కొట్టిన ఘనత అనుష్కదే. ఏకంగా 14 సంవత్సరాల పాటు సౌత్‌ను ఏలేసింది. “అరుంధ‌తి”తో అనుష్క టాప్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత “బిల్లా”, “పంచాక్ష‌రి”, “రుద్ర‌మ‌దేవి”, “భాగ‌మ‌తి”, “సైజ్ జీరో” లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే… మ‌రోవైపు “సింగం” లాంటి సినిమాల్లో హీరోయిన్‌గానూ గ్లామ‌ర్ ఒల‌క‌బోసింది. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “బాహుబలి”తో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. ‘భాగమతి’ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ భామ ఈ యేడాది ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో ‘ఝన్సీ లక్ష్మీబాయి’గా కాసేపు కనిపించి ప్రేక్షకులను అలరించింది. ప్ర‌స్తుతం హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో నిశ్శ‌బ్ధం అనే చిత్రం చేస్తుంది. ఇందులో దివ్యాంగురాలి పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నుంది. ఇదిలా ఉంటే తాజాగా అనుష్క ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఇద్దరు వ్యక్తులు అనుష్కకు ముద్దుపెడుతూ ఉన్నారు. అది కూడా ఒకేసారి చెరో బుగ్గపై తమ ఆత్మీయ ముద్దులు పెడుతున్నారు. నెల రోజుల కింద తన పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంది అనుష్క. అయితే అప్పుడు బయటికి రాని కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. ఇద్దరు అన్నయ్యలు చెల్లిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టారు. ఈ ఫోటోలో ముద్దుల చెల్లెలు కూడా మురిసిపోయింది.

Related posts