telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ బైసెక్సువ‌ల్… తానే స్వయంగా…!!

Vikas

బాలీవుడ్ నిర్మాత‌, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ వికాస్ గుప్తా తన గురించిన షాకింగ్ న్యూస్ ను బయటపెట్టారు. త‌ను బైసెక్సువ‌ల్ (ద్విలింగ సంప‌ర్కుడు) అనే విష‌యాన్ని తనే ప్ర‌క‌టించాడు. “హాయ్‌.. నా గురించి మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ద్విలింగ సంపర్కుడిని. స్త్రీ, పురుష భేదం లేకుండా నేను ఎవరితోనైనా ప్రేమలో పడగలను. నాలాంటి వారు చాలామంది ఉన్నారు. నేను బైసెక్సువల్‌ అని చెప్పడానికి గర్వంగా ఫీలవుతున్నాను. ఇందులో ఎవరి బెదిరింపులు లేవు. నన్ను నేను గుర్తించేందుకు సాయం చేసిన ప్రియాంకశర్మ, పార్థ్‌సంథాన్‌లకు ధన్యవాదాలు” అంటూ ట్వీట్‌ చేశారు. దేవుడు ఎలా సృష్టించారో నేను అలా మారాను. ఈ క‌ష్ట స‌మ‌యంలో నాతో అండ‌గా నిలిచిన వారికి ధ‌న్య‌వాదాలు అని వికాస్ స్ప‌ష్టం చేశారు.

Related posts