telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరోసారి రియల్‌ హీరో అనిపించుకున్న సోనూసూద్‌

సోనూ సూద్ కరోనా కాలంలో ఎందరో వలస కూలీలకు తనవంతు సహాయం చేశాడు. వారి కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి మరీ వారికి ఇళ్ళకు చేర్చాడు. అంతేకాకుండా ఇతర దేశాలలో ఉన్నా వారికోసం ప్రత్యే ఫ్లైట్లను కూడా పెట్టించాడు. దాంతో దేశంలో రియల్ హీరోగా పేరు పొందాడు. అంతేకాకుండా కరోనా కారణంగా నిరుద్యోగులైన వారికి ఎందరికో ఉద్యోగ అవకాశాలు ఇప్పించాడు.  ఇక తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు ఈ రియల్‌ హీరో. గుండె జబ్సుతో బాధపడుతున్న ఓ చిన్నారికి సాయం చేశారు సోనూసూద్‌. పశ్చిమ గోదావరి జిల్లా అన్నదేవరపేటకు చెందిన రామన వెంకటేశ్వరరావు, దేవి కూలీల ఎనిమిది నెలల కుమారుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యం చేయించుకునే స్థోమత కూడా లేకపోవడంతో సోనూసూద్‌ ట్రస్ట్‌ను ఆశ్రయించారు. వారి కష్టాన్ని అర్ధం చేసుకున్న సోనూ… బాలుడిని ముంబైలోని నారాయణ హృదాలయ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. బాలుడికి గుండె ఆపరేషన్‌కు అయ్యే ఖర్చును అంతా తానే భరించారు. దీంతో సోనూసూద్‌పై ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Related posts