telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

నేడు ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ…

paris farmers protest with tractors on roads

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రిపబ్లిక్‌ డే సందర్భంగా ఢిల్లీలో ఈరోజు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తున్నారు రైతులు.. ఫిబ్రవరి 1న పార్లమెంట్ కు మార్చ్ నిర్వహించనున్నారు. కాలినడకన పార్లమెంట్ కు వెళ్తామని రైతు సంఘం నేతలు తెలిపారు. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. అటు ట్రాక్టర్ల ర్యాలీ నేపథ్యంలో ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయనీ.. వాహనదారులు అటు రావొద్దని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఇక, గణతంత్ర దినోత్సవం  సందర్భంగా ట్రాక్టర్ల ర్యాలీకు 37 షరతులతో అనుమతి ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ర్యాలీకి అనుమతి ఉంది.. 5,000 ట్రాక్టర్లు, 5వేల మంది రైతులకు మాత్రమే అనుమతి ఇచ్చారు పోలీసులు.. అంబులెన్సులు, అత్యవసర వాహనాల కోసం ఒక లైన్ ( మార్గం) వదిలేయాని ఆదేశించారు. ఇక, అభ్యంతరకర పోస్టర్లు, బ్యానర్లు పట్టుకోరాదు, ప్రదర్శించరాదని షరుతులు విధించారు.. పేలుడు పదార్థాలు, ఆయుధాలు కలిగి ఉండరాదని స్పష్టం చేసిన పోలీసులు.. అనుమతించిన రూట్‌లో మాత్రమే ర్యాలీ నిర్వహించాలని పేర్కొన్నారు.. రోడ్లపై ధర్నాలు చేయడం గానీ.. బైఠాయించడం కానీ చేయకూడదనే షరతులు పెట్టారు. చూడాలి మరి ఈరోజు ఏం జరుగుతుంది అనేది

Related posts