telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సైరా” ఫస్ట్ డే కలెక్షన్స్

Syeraa

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌గాథ‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించిన చిత్రం “సైరా న‌ర‌సింహారెడ్డి”. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర‌లో న‌టించారు. తన కలల ప్రాజెక్ట్ “సైరా”ను తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా పట్టాలెక్కించాడు చిరు. ఈ సినిమా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమితాబ్‌, కిచ్చా సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో రూపొందించారు. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలలో విడుదల చేశారు. చరిత్ర గుర్తించని వీరుడి కథ అంటూ అక్టోబర్ 2 మహాత్మగాంధీ జయంతి రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా డైరక్షన్, మెగాస్టార్ చిరంజీవి నటన, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్ని సినిమాను కాపాడాయని చెప్పొచ్చు. అయితే అసలు కథకు మసాలా కోటింగ్ ఎక్కువైందన్న టాక్ నడుస్తోంది. మరి సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్‌ను పరిశీలిస్తే.. సైరా తొలిరోజు దేశ వ్యాప్తంగా రూ. 50 కోట్ల షేర్‌ను దాటినట్టు ఫిల్మ్‌ ట్రేడ్‌ వర్గాల సమాచారం. ఓవర్సీస్‌లో తొలిరోజు దాదాపు రూ. 10 కోట్లు షేర్ రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం అమెరికా, ఆస్ట్రేలియాలో బాక్సాఫీసు దగ్గర చక్కటి వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. సైరా.. సినిమా అమెరికా ప్రీమియర్‌ షోలలో 308 లొకేషన్లలో 8,57,765 డాలర్స్ అంటే దాదాపు రూ.6.16 కోట్లు రాబట్టినట్లు సమాచారం. అదేవిధంగా అటూ ఆస్ట్రేలియాలో 39 లొకేషన్లలో A$ 189,237 సాధించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా అమెరికాలో వన్‌ మిలియన్‌ మార్కును ఆల్రేడీ దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.190 కోట్ల భారీ బిజినెస్ చేసిన సైరాకు పాజిటివ్ టాక్ రావడంతో.. లాభాల బాట పట్టడానికి ఒకటి రెండు రోజులకంటే ఎక్కువ టైం పట్టదని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.

Related posts