telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్ ప్రసారాన్ని నిలిపి వేయండి… సమాచార శాఖకు ఎమ్మెల్యే లేఖ

Bigg-Boss

హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో వివాదాస్పదంగా మారింది. బిగ్‌బాస్ చెప్పినట్లుగా ఇందులో పాల్గొనే అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే మంచం షేర్ చేసుకోవాలని బిగ్‌బాస్ రూల్ పెట్టింది. ఈ రూల్ వల్ల వారు ఒకరిపై చేతులు, కాళ్లు వేసుకుని మరీ పడుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి షోల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని, పైగా సమాజంపై చెడు ప్రభావం చూపుతుందని తాజాగా ట్రేడర్స్ యూనియన్ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఐ అండ్ బీ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు సంఘ సభ్యులు లేఖ రాశారు. ఈ షో వల్ల భారతదేశం సంప్రదాయాలు, విలువలు మంటగలిసిపోతున్నాయని వాపోతున్నారు. ఈ షోను ప్రసారం చేయడానికి ముందు సెన్సార్ బోర్డుకు చూపించి వారు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతే ప్రసారం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ షోను అందరూ చూసేలా కాకుండా ఏజ్ లిమిట్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తాజాగా బిగ్‌బాస్-13 షో ప్ర‌సారాల‌ను త‌క్ష‌ణ‌మే నిలిపివేయాల‌ని ఘ‌జియాబాద్ బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. లోని(ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌) నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యే నంద్ కిషోర్ గుర్‌జార్‌.. ఈ నేప‌థ్యంలో కేంద్ర స‌మాచార మంత్రిత్వ‌శాఖా మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్‌కు లేఖ రాశారు. బిగ్‌బాస్-13 షో.. స‌మాజంలో నైతిక విలువ‌ల‌ను ప‌త‌నం చేస్తోంద‌ని విమ‌ర్శించారు. బిగ్‌బాస్ షో ద్వారా అస‌భ్య‌త కూడా విప‌రీతంగా ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు. త‌క్ష‌ణ‌మే ఆ షో ప్ర‌సారాల‌ను ఆపేయాల‌ని ఆయ‌న ప్ర‌భుత్వాన్ని వేడుకున్నారు.

Related posts