telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డబ్బుకాదు .. హీరోనే ముఖ్యం అంటున్న నయనతార..

nayanatara movie ira grand release

స్టార్‌ హీరోయిన్‌గా కోలీవుడ్‌లో నయనతార స్థానం పదిలం. ఇప్పట్లో ఆమె స్థాయిని అందుకునేవారే లేరని ఇండస్ట్రీ కోడై కూస్తుంది. ఆమె సినిమాల్లో హీరో నామమాత్రమే! అసలైన హీరో ఆమె! ఆమె పేరుతోనే కోట్లు వచ్చి పడుతుంటాయి. ఆ సంగతి ఆమెకు తెలుసు. అందుకే ప్రతి సినిమాకీ నిర్మాత నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేస్తుంది. డబ్బు విషయంలో అంతకచ్చితంగా ఉండే నయనతార ఇటీవల ఓ ఆఫర్‌ని వదులుకుంది.

కోలీవుడ్‌లో ఓ నిర్మాత కొత్త హీరోతో సినిమా మొదలెట్టాలని అనుకున్నారట. ఆ సినిమాలో నటించడానికి నయనతారకు పదికోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారట కూడా! అంత మొత్తం ఇస్తామన్నా నయనతార ఒప్పుకోలేదట! కారణం కొత్త హీరోనే అంటున్నారు. సో…నయనతారకి డబ్బుతో పాటు హీరో ఎవరు అన్నది కూడా కావాలన్నమాట అంటున్నారు తమిళ తంబిలు.

Related posts