telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అన్నయ్య ముందు బికినీ ఫొటోలు దిగిన బాలీవుడ్ హీరోయిన్…

sara

బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ఏకంగా తన అన్నయ్య ముందు బికినీ వేసుకుని మరీ హాట్ ఫొటోలు దిగింది. తన అన్న బర్త్‌డే సందర్భంగా ఇద్దరూ కలిసి విహారయాత్రకు వెళ్లారు. స్విమ్మింగ్ పూల్‌లో సారా బికినీ వేసుకుని అన్నతో కలిసి ఫొటోలు దిగారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దాంతో నెటిజన్లు ఆమెపై దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. అదీకాకుండా సారా ముస్లిం. దాంతో ఆ మతానికి చెందినవారు కూడా ఏకిపారేస్తున్నారు. మరోపక్క ఇది 21వ శతాబ్దం అని 2020లో కూడా ఇలాంటి సిల్లీ రూల్స్ పాటించడమేంటి అంటూ మరికొందరు సారాకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూతురైన సారాకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఖాతాలు తెరిచిన కొన్ని రోజులకే 20 లక్షల మందికి పైగా ఫాలోవర్లు పెరిగిపోయారు. ఏదన్నా ఫొటో పెట్టగానే గంటకే పది లక్షలకుపైగా లైక్స్ వస్తున్నాయంటే ఆమెకు ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉందో అర్థంచేసుకోవచ్చు. సారా చేసింది రెండు సినిమాలే అయినా స్టార్ హీరోయిన్‌కు ఉండాల్సినంత క్రేజ్ వచ్చేసింది. మొదటి సినిమా షూటింగ్ అవుతుండగానే వరుసగా మూడు సినిమాలకు సంతకం చేసేసింది.

Related posts