telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ సినిమా ఫ్లాప్ కావడానికి మగవారే కారణమట… హీరోయిన్ వ్యాఖ్యలు

Elizabeth

ప్రముఖ హాలీవుడ్ నటి, డైరెక్టర్ ఎలిజబెత్ బ్యాంక్స్ తెరకెక్కించిన సినిమా ‘చార్లీస్ ఏంజిల్స్’. గత వారం ఈ సినిమా విడుదలైంది. 55 మిలియన్ డాలర్లు పెట్టి తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం 28.2 మిలియన్ డాలర్లు మాత్రమే రాబట్టింది. ఈ సినిమాలో ఎలిజబెత్ బ్యాంక్స్ కీలక పాత్రలో నటించారు. పైగా సినిమాకు సహ నిర్మాతగానూ వ్యవహరించారు. అమెరికన్ యాక్షన్ కామెడీ సినిమాగా దీనిని తెరకెక్కించారు. 2000లో చార్లీస్ ఏంజిల్స్ పేరుతో తొలి యాక్షన్ కామెడీ వచ్చింది. ఆ తర్వాత 2003లో ‘చార్లీజ్ ఏంజిల్స్: ఫుల్ థ్రాటిల్’ పేరుతో రెండో సిరీస్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటికీ కొనసాగింపుగా తెరకెక్కించినదే చార్లీస్ ఏంజిల్స్. క్రిస్టన్ స్టీవర్ట్, నవోమీ స్కాట్, ఎల్లా బాలిన్స్‌కా వంటి స్టార్ హీరోయిన్స్ కలిసి నటించిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇందుకు కారణమేంటో ఎలిజబెత్ మీడియా ముందు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “నా సినిమా ఫ్లాప్ అవడానికి కారణం మగవారే. ఎందుకంటే వాళ్లు మగవాళ్లు స్టంట్స్ చేస్తే సినిమాలు చూస్తారు కానీ అదే పని ఆడవాళ్లు చేస్తే మాత్రం చూడరు. ఆడవాళ్లు ప్రధాన పాత్రల్లో నటించే సినిమాలన్నీ ఇలా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయితే అసలు వాళ్లు స్టంట్ సినిమాలు చేయలేరు అన్న అభిప్రాయానికి వచ్చేస్తారు. ఈ ముగ్గురూ నటించిన కెప్టెన్ మార్వెల్, బ్రీ లార్సన్, వండర్ వుమెన్ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. ఎందుకంటే అవి మేల్ జోనర్‌కు చెందిన సినిమాలు. కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ సాధించినందుకు నాకు సంతోషంగా ఉంది. కానీ మహిళా నేపథ్యంలో తెరకెక్కే సినిమాలు మున్ముందు మరిన్ని రావాలి. ఎందుకంటే డబ్బే పవర్. ఆ పవర్ డబ్బులోనే ఉంది” అని తెలిపారు.

Related posts