పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంబరాల్లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో పవన్ బర్త్ డే వేడుకల్లో భాగంగా దాదాపు 25 అడుగుల ఫ్లెక్సీ కడుతుండగా… విద్యుదాఘాతానికి గురై ముగ్గురు పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 10 మంది పవన్ అభిమానులకు కరెంట్ షాక్ తగిలింది. వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా… మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా శాంతిపురం మండలం కడపల్లి గ్రామానికి చెందినవారు. ఈ ఘటనపై మెగా హీరో రామ్ చరణ్ స్పందించాడు. “కుప్పంలో జరిగిన దుర్ఘటనలో ముగ్గురు యువకులు మరణించారనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. మీ ఆరోగ్యం, ప్రాణం కంటే ఏది విలువైనది కాదు. మీరు ఎల్లప్పుడు ఇది గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని నా మనవి. ఈ దుర్ఘటనలో మరణించిన వారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వాళ్ళు కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని చరణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్, వకీల్ సాబ్ టీం ఒక్కో కుటుంబానికి రూ.2లక్షల రూపాయలు అందించనున్నట్టు పేర్కొన్నారు.
previous post
next post