telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

బంగారం ప్రియులకు అదిరిపోయే శుభవార్త..పడిపోయిన ధరలు

బంగారంకు ఉన్న డిమాండ్ మారేదానికి లేదు. బంగారం ఎంత ధర ఉన్న కొనడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే కరోనా వల్ల బంగారం ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే బులియన్‌ మార్కెట్‌లో గత రోజులుగా పెరిగిన బంగారం ధరలు తాజాగా మళ్లీ తగ్గాయి. అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్‌లోనూ బంగారం ధరలు బాగా పడిపోయాయి. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ భారీగా పడిపోయాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 తగ్గి రూ. 47,350 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి రూ. 43,400 పలుకుతోంది. బంగారం ధర తగ్గగా.. వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ.71,900 వద్ద కొనసాగుతోంది.

Related posts