మేషం: ఐరన్, సిమెంట్, కలప, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. పాత మిత్రులతో ఆనందంగా గడుపుతారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కొంటారు. చిన్న చిన్న విధులను సైతం ఎక్కువ శ్రద్ధతో నిర్వర్తించే ప్రయత్నం చేయండి.
వృషభం: ఆర్థిక సమస్యలు తలెత్తటం వల్ల ఆందోళన చెందుతారు. స్త్రీలు ఆహార విషయంలో వేళ తప్పి భుజించడం వల్ల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. ట్రాన్స్‌పోర్ట్, ఆటో మొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు. నూతన పరిచయాలేర్పడతాయి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది.
మిథునం: బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. కొత్తగా ప్రారంభించిన వ్యాపారాల్లో దినదినాభివృద్ధి చెందుతారు. ఏది జరిగినా మంచికేనని భావించండి. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది.
కర్కాటకం: నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. అక్రమ సంపాదనల వైపు దృష్టి సారించకపోవడం మంచిది. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలు ఆహార విషయంలో వేళ తప్పి భుజించడం వలన ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు.
సింహం: ఉమ్మడి ఆర్థిక వ్యవహారాల్లో మాటపడాల్సి వస్తుంది. ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. ఉద్యోగస్తులకు శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మీరు దేనిని నమ్ముతారో ఆ విషయనై ఇతరులతో ధైర్యంగా మాట్లాడండి.
కన్య: మీ అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం మంచిది కాదని గమనించండి. నూతన వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది. మార్కెట్ రంగాల వారికి నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి.
తుల: కొబ్బరి, పండ్లు, పువ్వులు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. మీరు దేనిని నమ్ముతారో ఆ విషయమై ఇతరులతో ధైర్యంగా మాట్లాడండి. ఫైనాన్స్, చిట్ ఫండ్ రంగాల్లో వారికి అనుకూలమైన కాలం.
వృశ్చికం: రేషన్ డీలర్లు, ప్రభుత్వోగ్యోలకు చికాకులు తప్పవు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. కొత్త పనులు ప్రారంభించడంలో అడ్డంకులు ఎదురవుతాయి. మీ ఆలోచనలు పంచుకునే వారి కోసం మనసు తహతహలాడుతోంది. సహోద్యోగులతో సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
ధనస్సు: అధికారులు ధనప్రలోభం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం వుంది. మీ యత్నాలు కొంత ఆలస్యంగానైనా పరిపూర్ణంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సమాచార లోపం వల్ల ఒక అవకాశం చేజారిపోతుంది. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రయాణాల్లో ఒకింత అసౌకర్యానికి గురవుతారు.
మకరం: నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకూలంగా వుండగలదు. కోర్టు వ్యవహారాలు ముందుకు సాగక నిరుత్సాహం చెందుతారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. ఉపాధ్యాయులు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధువులతో రాక గృహంలో సందడి కానవస్తుంది.
కుంభం: రాజకీయ నాయకులకు కార్యకర్తల వల్ల చికాకులు తప్పవు. మీ చిన్నారుల మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఇతరులు మీ పట్ల ఆకర్షితులౌతారు. హోటల్ తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
మీనం: స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి శుభం చేకూరుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే సంఘటనలెదురవుతాయి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. రాబడికి తగినట్లుగానే ఖర్చులు వుంటాయి. వాహనం వీలైనంత నిదానంగా నడపటం మంచిది.