ఓ ప్రియా .,,,,
దేవదాసుకేం తెలుసు ?
నువ్వు కనబడని క్షణం
నా మనసు కలవరపడుతుందని
సలీంకేం తెలుసు ?
నీ పలుకులు వినపడని క్షణం
నా హృదయం భారమౌతుందని
కాళిదాసుకేం తెలుసు ?
నీ పై కవిత రాయని క్షణం
నా కలం కలకలం రేపుతుందని
మజ్నుకేం తెలుసు ?
నీ దరహాసాన్ని చూడని క్షణం
నా మోము చిన్నబోతుందని
కానీ…నీకు మాత్రమే తెలుసు !
నిత్యం నా మదిలో నీవు
దేవతలా కొలువుంటావని
నీ స్మృతిలో నేనెప్పుడూ
భక్తుడిలా నిలిచుంటానని
-కయ్యూరు బాలసుబ్రమణ్యం,
శ్రీకాళహస్తి
బాలకృష్ణ అహంకారంపై నాగబాబు కామెంట్