telugu navyamedia
రాశి ఫలాలు

సెప్టెంబర్ 25, శనివారం రాశి ఫ‌లాలు..

మేషం..
ప్రముఖులతో పరిచయాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది. ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కొంత కాలం వాయిదా వేయటం మంచిది.

వృషభం….
అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. 

మిథునం…
వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తులతో సత్సంబంధాలు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు లాభదాయకం. క్రీడా, కళా, రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి.

కర్కాటకం…
వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆస్తిలాభం. పరిచయాలు పెరుగుతాయి. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగస్తులు సమస్యల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులకు నూతన వాతావరణం, పరిచయాలు సంతృప్తినిస్తాయి. 
సింహం…
వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగస్తులకు చికాకులు. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్‌ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఆందోళన తప్పదు. కొన్ని కారణాల రీత్యా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. 

కన్య…
సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు. అనారోగ్యం. పనులలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు.

తుల…
పనుల్లో విజయం. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తులు కొంటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పైచేయి. సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధువుల ఇంట శుభసందర్భాల్లో కీలకపాత్ర వహిస్తారు. 

వృశ్చికం…
పలుకుబడి పెరుగుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికాభివృద్ధి. పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. రాజకీయ, కళారంగాల్లో వారు సన్మానాలు పొందుతారు. పాతరుణాలు తీసుస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది.

ధనుస్సు…
పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. కష్టానికి ఫలితం కనిపించదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు ఏర్పడవచ్చు. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. రాబడికి మించిన ఖర్చులవుతాయి.
మకరం…
సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు. దైవదర్శనాలు. మీ ఆలోచనలు క్రియా రూపంలో పెట్టండి. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి.

కుంభం…
పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిత్రమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాడు.

మీనం…
వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. బంధువులతో తగాదాలు. మానసిక అశాంతి. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. మీ ఆశయసిద్ధికి అవరోధాలు కలుగుతాయి. మీ ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం.

Related posts