ఒక్క రోజే ట్రూనాట్ మిషన్ల ద్వారా 4వేలకుపైగా కక్రోనా పరీక్షలు చేశామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. కోవిడ్-19 నివారణా చర్యలపై జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ర్యాపిడ్ పరికరాలు, స్క్రీనింగ్ కోసం వాడే కొత్త పరికరాల సహాయంతో గణనీయంగా పరీక్షల సామర్థ్యం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. వారం రోజుల్లో ల్యాబుల సంఖ్య 12కు పెంచుతున్నామని సీఎంకు అధికారులు వివరించారు.
తిరుపతిలో అదనంగా మరో రెండు ల్యాబ్‌లు, కర్నూలులో ఒకటి, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ఒక్కో ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తామని జగన్ తెలిపారు. రూ.100లకు ఐదు రకాల పండ్ల పంపిణీ బాగుందని సీఎం ప్రశంసించారు.
మంత్రిని చేస్తానని కేసీఆర్ మాట తప్పారు.. నాయిని సంచలన వ్యాఖ్యలు