telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జమ్ము కశ్మీర్‌ .. భారత రాష్ట్రంగా ఒప్పుకున్న పాక్ .. నోరు జారినట్టు..

pak minister qureshi on J & K in janiva

ఆర్టికల్ 370 రద్దు తర్వాత, పాక్ కవ్వింపు చర్యల్ని కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికీ భారత్‌లో అలజడి సృష్టించాలని పాక్ చేస్తున్న కుట్రలు బయటపడుతూనే ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దు భారత్ అంతర్గత విషయమని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో చెబుతున్నప్పటికీ పాక్ మాత్రం తన వాదనను వెనక్కి తీసుకోవడం లేదు. అమెరికా, చైనా లాంటి దేశాలు సైతం ఈ విషయంలో వెనక్కి తగ్గాయి. భారత్‌ను దోషిగా నిలిపేందుకు పాక్ అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. భారత్ కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందని ఐక్యరాజ్య సమితిలో మానవహక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జెనీవాలో జరిగిన యూఎన్ మానవహక్కుల కమిషన్ మండలి సమావేశానికి పాక్ విదేశాంగ మంత్రి మమ్మద్ ఖురేషీ హాజరై భారత్‌పై విషంగక్కారు.

కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చెప్పే క్రమంలో భారత దేశంలోని రాష్ట్రమైన జమ్ము కశ్మీర్ అంటూ ప్రారంభించారు. కశ్మీర్‌లో తాజా పరిస్థితులను సమీక్షించేందుకు యూఎన్ ఆధ్వర్యంలో ఓ కమిటీ వేయాలని, వారికి తాము పూర్తి మద్దతునిస్తామని ఖురేషీ పేర్కొన్నారు. అదే సమయంలో కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు ఉన్నాయంటూ భారత్ చెప్పడాన్ని మహ్మద్ ఖురేషీ తప్పుబట్టారు.

Related posts