telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆ పాకిస్తానీయులు .. పెళ్లి చేసుకోవడానికి .. భారత్ వస్తున్నారట..

Pakistanis come to india to marry

విభజన నుండి భారత్ తో పాక్ గొడవలు పడుతుండటం తప్ప ఏమి సాధించింది లేదనేది మరోసారి రుజువైంది. చీటికీమాటికీ భారత్ తో గొడవలు పడటం తప్ప .. కనీసం పాక్ లో పెళ్లిళ్లు కూడా సందడిగా చేసుకోలేని స్థితి. దీనితో వాళ్ళందరూ భారత్ వచ్చి, వేడుకగా పెళ్లి చేసుకొని వెళ్తుండటం సర్వసాధారణం అయిపోయింది. ఒకవైపు సరిహద్దులలో ఉద్రిక్తతలు, మరోవైపు కశ్మీర్‌లో ఆర్టికల్ 370, 35A రద్దు చేయడంతో నెలకొన్న పరిస్థితులు కూడా ఈ వేడుకలకు అడ్డు కాకపోవటం విశేషం. తాజాగా కూడా ఇటువంటి పెళ్లి జరిగింది. వీరి పెళ్లిని ఎటువంటి అననుకూల పరిస్థితులు అడ్డుకోలేకపోయాయి. సరిహద్దు దాటి భారత్‌లో ప్రవేశించి గుజరాత్‌లోని రాజ్ కోట్‌లో ఆడంబరంగా వివాహం చేసుకున్నారు. ప్రత్యేకించి వివాహం చేసుకునేందుకే సరిహద్దు దాటారట.

సాధారణంగా పాక్ చట్టం ప్రకారం.. కమ్యూనిటీ మ్యారేజీలు అక్కడ నిర్వహించడం కుదరదు. దీంతో పాక్‌లోని మహేశ్వరి కమ్యూనిటీ.. పెళ్లికూతురు, పెళ్లికొడుకుని భారత్‌కు పంపించి పెళ్లి చేసుకోవాలని సూచించింది. ప్రతి ఏడాది రాజ్ కోట్‌లో మహేశ్వరి కమ్యూనిటీ నుంచి ఒకే వేదికపై సామూహిక వివాహాలు నిర్వహిస్తుంటారు. పాక్ నుంచి మహేశ్వరిలు ప్రత్యేకించి పెళ్లిలో ఒక భాగంగా ఉంటారు. వధువరూల విషయానికి వస్తే.. పాక్ లో పెళ్లి చేసుకున్నా.. ఎలాంటి పెళ్లి మేళం ఉండదు.. బరాత్ ఊరేగింపు జరుగదు. ఇంట్లో కూర్చొని సింపుల్ గా పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. భారత్‌లో అయితే అటువంటి ఆంక్షలు ఉండవు. అందుకే పెళ్లి చేసుకునేందుకు రాజ్ కోట్ కు వస్తుంటారు. ఇక్కడ అయితే తమకు నచ్చినట్టుగా అతిథులను పిలుచుకోవచ్చు.. పాటలు పాడొచ్చు.. డ్యాన్స్ లు వేస్తూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవచ్చునని వధువరులు తెలిపారు.

పాక్ లోని కరాచీకి చెందిన ఓ నివాసి అనిల్ మహేశ్వరి (పెళ్లికొడుకు) మాట్లాడుతూ.. ఇండియాలో మాదిరిగానే పాకిస్థాన్ లో కూడా మహేశ్వరి కమ్యూనిటీ వారు ఎంతోమంది ఉన్నారు. జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దుకు మద్దతిస్తున్నామని అన్నాడు. గుజరాత్ లోని రాజ్ కోట్, కటచ్ ప్రాంతాల్లో చాలామంది మహేశ్వరీ కమ్యూనిటీ వారు ఉన్నారని తెలిపాడు. భారత్-పాక్ విభజన సమయంలో కొంతమంది పాక్ లోనే ఉండిపోయినట్టు చెప్పాడు. భారత్ లో చాలా కుటుంబాలు ఇప్పటికీ ఆహారాన్ని మార్పిడి చేసుకుంటున్నాయని, సరిహద్దుల్లో నివసించే వారి కుమార్తెలను పెళ్లి చేసుకోవడం కూడా ఎప్పటినుంచో సంప్రదాయంగా అనుసరిస్తున్నట్టు తెలిపాడు. పాక్ నుంచి వచ్చిన మహేశ్వరి కమ్యూనిటీకి చెందిన చాలామంది రాజ్ కోట్ లో నివసిస్తున్నారు.. వీరిందరికి భారత పౌరసత్వం కూడా ఉందట.

Related posts