ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఆమోదించిన పలు బిల్లులకు గవర్నర్ బీబీ హరిచందన్ ఆమోదముద్ర వేసి చట్టబద్దత కల్పించారు. మొన్నటి అసెంబ్లీ సమావేశాలలో 11 బిల్లులకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. వీటిలో ఎస్సి, ఎస్టీ, మైనారిటీలకు కాంట్రాక్టులలో యాభై శాతం రిజర్వేషన్, కాంట్రాక్టులలో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్, ఉద్యోగాలలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్, కౌలు రైతుల హక్కుల బిల్లు వంటి కీలక బిల్లులు ఉన్నాయి.
అసెంబ్లీ ఆమోదించిన సదరు బిల్లులకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి గెజిట్ విడుదల చేశారు.