telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అందుకే ఆర్ఆర్ఆర్ కోసం ఆ హీరోను తీసుకున్నా… రాజమౌళి

Rajamouli

టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అజయ్‌ దేవగన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఫ్లాష్‌ బ్యాగ్ ఎపిసోడ్‌లో ఈయన కనిపించనున్నారు. కాగా ఈ సినిమాలో కీలక పాత్ర కోసం అజయ్‌ను తీసుకోవడానికి గల కారణాలను రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ”ఈ సినిమాకు అజయ్‌ పాత్ర చాలా కీలకం. ఆయన పాత్ర చాలా బావుంటుంది. ఆయన సినిమాల్లోనే కాదు.. బయట కూడా అంత నిజాయితీగా ఉంటారు. ఈ పాత్ర కోసం నటుడిలో ఉండాల్సిన లక్షణాలు, నా అవసరాలు కొంత మందికి చెప్పి, సలహా అడిగినప్పుడు.. పది మందిలో తొమ్మిది మంది అజయ్‌ పేరు చెప్పారు. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ చెప్పిన వెంటనే ఇందులో నటించేందుకు ఆయన ఒప్పుకోవడం, తనకు చాలా సంతోషానిచ్చింది. ఆయన ఎంతో అంకితభావంతో పనిచేశారు” అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

Related posts