telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

నంద్యాల టికెట్ నాదే.. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా .. : ఎస్పీవై రెడ్డి

huge demand for nandyal constitution

ఏపీలో కొన్ని స్థానాలకు విపరీతమైన పోటీ ఉంది. అధిష్టానం టికెట్ గెలుపు గుర్రాలకే ఇస్తాను అంటుంటే, పార్టీకోసం ఎప్పటి నుండో పనిచేస్తున్న వారు మాత్రం తామేకె ప్రాధాన్యం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ స్థితిలోనే నంద్యాల నియోజక వర్గానికి భారీ పోటీ ఉంది. దీనితో ఆ లోక్ సభ స్థానానికి తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ను ఆశిస్తున్న సీనియర్ నేత ఎస్పీవై రెడ్డి, తనకు సీటివ్వకుంటే, ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు సిద్ధమన్న సంకేతాలు ఇచ్చారు. ఈ స్థానం కోసం పోటీ అధికంగా ఉండటం, ఇటీవల టీడీపీలో చేరిన కోట్ల కుటుంబంతో పాటు, ఉమ్మడి రాష్ట్రంలో అదనపు ఎస్పీ హోదాలో పనిచేసి, పదవీ విరమణ తరువాత టీడీపీలో చేరిన మాండ్ర శివానందరెడ్డి తదితరులతో పాటు, భూమా ఫ్యామిలీ సైతం టికెట్ ను కోరుతున్నాయి.

TDP MP list final shortly Chandrababuపార్టీని నమ్ముకుని ఉన్న తనకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, ముందుగా అనుకున్న ప్రకారం, తాను 22వ తేదీన నామినేషన్ వేయాలనే నిర్ణయించుకున్నానని ఎస్పీవై రెడ్డి తన అనుచరులకు స్పష్టం చేశారని తెలుస్తోంది. వాస్తవానికి 2014 ఎన్నికల్లో ఎస్పీవై రెడ్డి నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆపై 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచిన ఆయన, కొద్ది రోజుల్లోనే తెలుగుదేశం కండువా కప్పేసుకున్నారు. ఇప్పుడు టికెట్ రాకుంటే, తిరిగి వైసీపీలోకి వెళ్లినా టికెట్ దక్కే చాన్స్ లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండాలని భావిస్తున్నారు.

Related posts