దక్షిణాఫ్రికా మాజీ కోచ్ రసెల్ డొమింగోను బంగ్లాదేశ్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించినట్టు ఆ దేశ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించింది. ఈ నెల 21న రసెల్ జట్టుతో కలుస్తాడని తెలిపింది. భారత జట్టు కోచ్ రేస్‌లో షార్ట్ లిస్ట్ అయిన మైక్ హెసన్, పాక్ కోచ్‌గా పదవీ బాధ్యతలు ముగించుకున్న మిక్కీఆర్థర్‌లు కూడా బంగ్లాదేశ్ కోచ్ పదవి కోసం చివరి వరకు పోటీలో నిలిచారు. వీరిద్దరినీ కాదని చివరికి రసెల్‌ను కోచ్‌గా ఎంపిక చేశారు.
బంగ్లాదేశ్‌కు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తున్న ఖాలే మహ్‌ముద్ నుంచి రసెల్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌తో బంగ్లాదేశ్ కోచ్ స్టీవ్ రోడ్స్ కాంట్రాక్ట్ ముగిసింది. దీంతో కొత్త కోచ్ ఎంపిక అనివార్యమైంది.
కరీంనగర్ కేంద్రంగానే మరో ఉద్యమం చేయాల్సి వస్తుంది : ఈటల