telugu navyamedia
ఆరోగ్యం

కరోనా ఎఫెక్ట్ మహిళలకన్నా పురుషులకే ఎక్కువ… కారణం అదేనా …

karona

కరోనా వైరస్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా మహిళల కంటే పురుషులు అధికంగా మరణిస్తున్నారు. ఈ వ్యత్యాసానికి జన్యుపరమైన కారణాలు ఉన్నాయంటున్నారు కెనడాకు చెందిన ఫిజీషియన్‌ డాక్టర్‌ షరోన్‌ మోలెమ్‌. ముఖ్యంగా మహిళల్లో ఉండే ఎక్స్‌, ఎక్స్‌ క్రోమోజోమ్‌లు కరోనాను సమర్థంగా ఎదుర్కోవడానికి వారికి ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. కాగా.. పురుషుల్లో ఎక్స్‌, వై క్రోమోజోమ్‌లు ఉంటా యి. కానీ మహిళల్లో ఎక్స్‌, ఎక్స్‌ క్రోమోజోమ్‌లు ఉంటాయి. మెదడుకు సంబంధించిన ముఖ్యమైన జన్యువులు ఎక్స్‌ క్రోమోజోమ్‌లోనే ఉంటాయి. అదీగాక మనిషి జీవించడానికి కూడా వై క్రోమోజోమ్‌ కంటే ఎక్స్‌ క్రోమోజోమే అత్యంత కీలకం. పురుషుల్లో కండబలం, శారీరక బలం ఉంటుంది. కానీ దీర్ఘకాలం జీవించడానికి వీటికంటే ఎక్స్‌ క్రోమోజోమ్‌లే ఎక్కువగా దోహదం చేస్తాయి. మహిళలకు ఇది పుట్టుకతో సహజంగా వచ్చే ప్రయోజనం. ఈస్ట్రోజన్‌ వల్ల కూడా మహిళల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. మరోవైపు.. పురుషుల్లో టెస్టోస్టిరాన్‌ రోగనిరోధకతను తగ్గిస్తుందని డాక్టర్‌ షరోన్‌ చెప్పారు. అందువల్ల జన్యుపరంగానే పురుషుల్లో ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధులపై పోరాడే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. క్యాన్సర్‌ విషయంలో కూడా పురుషులకంటే మహిళలే మెరుగ్గా తట్టుకోగలుగుతున్నారు. డబుల్‌ ఎక్స్‌ క్రోమోజోమ్‌ పవరే దీనికి కూడా కారణం అని డాక్టర్‌ షరోన్‌ అభిప్రాయం. తన పరిశోధనల 

Related posts