telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సలార్” లో విలన్ గా బాలీవుడ్ స్టార్..?

బాహుబలి సినిమాతో పాన్‌ ఇండియన్‌ స్టార్‌గా ప్రభాస్‌ ఎదిగిన విషయం తెలిసిందే. ఈ పాన్‌ ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ఇటీవలే చేసిన మరో భారీ ప్రాజెక్ట్‌ “సలార్‌” మూవీ. కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో ఎప్పటి నుంచో అనుకుంటున్నా… ఈ సాలిడ్‌ సినిమా మోస్ట్‌ అవైటెడ్‌ ప్రాజెక్టుగా నిలిచింది. ఇటీవలే సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది. ‘ది మోస్ట్ వాలైంట్ మెన్.. కాల్డ్ వన్ మెన్.. ది మోస్ట్ వాలైంట్’ అంటూ ప్రభాస్ గూర్చి తెలియజేస్తూ “సాలార్” టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ప్యాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న డార్లింగ్ ప్రభాస్ లుక్ అలరిస్తుంది.
ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ సినిమా నుంచి మరో వార్త వైరల్‌ అవుతోంది. ఈ సినిమాలో సాలిడ్‌ విలన్‌ రోల్‌కు గాను మళ్లీ బాలీవుడ్‌ నుంచే ఓ స్టార్‌ నటుడునే ప్రశాంత్ నీల్‌ తీసుకుంటున్నారని టాక్‌ నడుస్తోంది. ఇప్పటికే కేజీఎఫ్‌ లోని అధీరాగా సంజయ్‌ దత్‌ను తీసుకున్నారు. మరి ఇప్పుడు అలాగే ఓ సీనియర్‌ స్టార్‌ నటుడినే సలార్‌లో ప్రభాస్‌కు విలన్‌గా తీసుకోనున్నారట. మరి ప్రశాంత్‌ నీల్‌ మళ్లీ సంజయ్‌ దత్‌నే ఎంచుకుంటారా? లేక ఇంకేవరినైనా తీసుకుంటారా? అని తెలియాల్సి ఉంది. కాగా.. ప్రశాంత్‌ నీల్‌ ఇప్పటికే క్యాస్టింగ్‌ మరియు టెక్నికల్‌ పనుల్లో బిజీగా ఉన్నారు.

Related posts