telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

దుఃఖాన్ని దాచుకోవాలి….తప్పదు…!!

దుఃఖాన్ని దాచుకోవాలి….తప్పదు…

అది చెప్పుకుంటే తీరేదికాదు…అది

ఎంత తీవ్రమైనదైనా సరే తేలికైనా సరే…..

ఎంతో ఆప్తుడికి ,శ్రేయోభిలాషికి మాత్రమే

చెప్పుకోవాలి…

చెప్పుకునేంత గొప్ప ఆత్మీయుడు వున్నాడా?

సమీక్షించి సరిచేసే సమర్థుడు ఎవడు?

ఏడి ఎక్కడా కనపడరే….!

మాటలతో వేదించే వారేకాని

వేదనను తుంచేవాడేడి?

పంచుకునే వాడెవ్వడు…?

 

ఆంతా ఆత్మవంఛనా పరులే

మిడిమిడి జ్ఞానవంతులే!

.

తడికళ్ళను తుడిచే వాడుండడు..

నేనున్నానని వీపు తట్టే వాడుండడు…

 

గుర్తుపెట్టుకో బురద పూసే వారేకాని

కడిగే వాడుండడు

అంతా నాకెందుకనే స్వార్థపరులే…

 

నీ కష్టం నీ నష్టం నీ కన్నీళ్లు నీ దుఃఖం

నీవు చూసుకోవాలి..

 

చెప్పుకుంటే తేలిక అవుతుందంటారు కాని ,

తేలికవడం దేవుడెరుగు

చులకనవుతామనేది యదార్ధం…

 

దుఃఖానికి

కారణాలు అనేకం వుంటాయి..

స్వయంక్రుతాలే ఎక్కువ

దానికి నిర్లక్ష్యమే మూలం…

భయం ప్రధాన కారణం..

 

దుఃఖం అవగాహన లోపంతో వస్తుంది

అవకాశాలను పోగొట్టి వస్తుంది…

నిందలు పడేలా చేస్తుంది

బంధాలను తెంచేస్తుంది..

 

మనకు ఏదో తెలుసనుకుంటాం

నిజానికి తెలిసింది చాలా తక్కువే….

 

అసలు తెలిసి వుంటే దుఖ్ఖమే రాదు

తెలిసి వుండటం అంటే పరిస్థితులను

అర్థం చేసుకోవడం…

 

అర్థం చేసుకోవడానికి ఓర్పు కావాలి…

ఓర్పు ఊరికే రాదు

కష్టించే గుణంతో వస్తుంది

దుఃఖాన్ని జయించే దారి అదే

చూయిస్తుంది…..

Related posts