telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్‌లో ఆరు కోట్ల డ్రగ్స్ పట్టివేత

Drugs hyd

హైదరాబాద్‌ నగర శివారులో డీఆర్‌ఐ అధికారులు పెద్దమొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సుమారు ఆరు కోట్లు విలువ చేసే 52 కిలోల నార్కోటిక్ డ్రగ్స్‌ను అధికారులు పట్టుకున్నారు. డ్రగ్స్ మాఫియా 52 కిలోల మాదక ద్రవ్యాలను ప్లాస్టిక్ సంచుల్లో పెట్టి భూమిలో దాచి పెట్టినట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు.

భూమిలో దాచి పెట్టిన 45 కిలోల ఎఫైడ్రిన్ 7.5 మెఫిడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజులు క్రితం జిన్నారం పారిశ్రామికవాడలోని గడ్డిపోచారం వద్ద వంద కోట్లు విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నేపథ్యంలో ఈరోజు మరోసారి నిందితులు ఇచ్చిన సమాచారంతో ఆరు కోట్ల డ్రగ్స్‌ను అధికారులు పట్టుకున్నారు.

Related posts