వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో వరుణుడు కరుణించలేదు. జూన్ నెల ముగింపునకు వచ్చినా ఇంకా వర్షాలు మాత్రం పడటం లేదు. ఇప్పుడిప్పుడే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభం అయ్యాయి. మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన పెద్దలు వర్షాల కోసం బొమ్మలకు పెళ్లి చేశారు. వార్ధా జిల్లా ప్రాంతంలో కరువు ఎక్కువగా ఉంటుంది. వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఈసారి వర్షాలు బాగా పడాలని వాళ్లు వాన దేవుడిని మొక్కుకుంటూ.. మరో వైపు బొమ్మల పెళ్లి చేయడం విశేషం.
previous post
టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు: బాలినేని