కేరళ సీపీఎం చీఫ్ కొడియేరి బాలకృష్ణన్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. బాలకృష్ణన్ తన కుమారుడి అనైతిక ప్రవర్తనకు మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఆయన కుమారుడు బినయ్ తనపై అత్యాచారం చేసినట్లు ఓ మహిళ ముంబైలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తన పదవికి రాజీనామా సమర్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన రాజీనామా వార్తలపై పార్టీ వర్గాలు ఇప్పటి వరకు స్పందించలేదు. ఘటనపై స్పందించిన బాలకృష్ణన్ .. నిందిడుడిని ఎవరూ రక్షించలేరని పేర్కొన్నారు.
బిహార్‌కు చెందిన ఓ మహిళ బినయ్ తనపై అత్యాచారం చేసినట్లు ఇటీవల ముంబైలో ఫిర్యాదు చేశారు. తనను చాలా సంవత్సరాలుగా ఆయన లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. తన ఎనిమిదేళ్ళ బిడ్డకు తండ్రి ఆయనేనని పేర్కొన్నారు. ఈ వాస్తవాన్ని నిరూపించేందుకు ఎటువంటి పరీక్షలకైనా తాను సిద్ధమేనని చెప్పారు. బినయ్ దుబాయ్‌లో వ్యాపారం చేస్తుండగా.. ఆమెకూడా దుబాయ్‌లో బార్ డ్యాన్సర్‌గా చేసినట్లు పోలీసులు సమాచారం.
కమల్ అనుచిత వ్యాఖ్యల పై కేసు నమోదు